Saturday, December 10, 2011

మన"సు"భాషణం


ఎన్నో జన్మల పుణ్యఫలం మానవ జీవితం. దానిని సార్ధకం చేసుకునే క్రమంలో, పుట్టిననాటి నుండి నేటి వరకు జీవితంలో ఎన్నో అనందాలు, అనుభవాలు, ఆవేశాలు, ఆలోచనలు, సుఖ దుఖాలు, కష్ట నష్టాలు - వీటన్నిటి వెనక ఎన్నో ఎన్నెన్నో విషయాలు - విశేషాలు.. వీటిని మంచి మనసున్న మనోజ్ఞమూర్తులతో  పంచుకునేందుకు చేసిన చిన్ని ప్రయత్నమే నా మన"సు"భాషణం !!

"దేశబాషలందు తెలుగు లెస్స" అని తెనుగు రాయడైన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు చేత ప్రస్తుతింపబడి, రాజ రాజ నరేంద్రుని ఆస్థానంలో "బాలసారె" జరుపుకొని, నన్నయభట్టారకుని చేత నామకరణం చేయించుకొని, తిక్కనామాత్యుని చేతిలో తీరైన సొబగులు నేర్చుకొని, ఎర్రాప్రగడ వారి ఒడి బడి లో ఓనమాలు దిద్దుకొని, రాజసింగంబైన "సాహితీ సమరాంగణ సార్వభౌముడు" శ్రీకృష్ణదేవరాయల పుణ్య పాలనా సుధాంభుది లో పన్నీటి స్నానాలాచరించి, శ్రీనాధ కవి సార్వభౌముని చేతిలో సింగారాలు అద్దుకొని, పోతనామాత్యుని పరమ పావన కవితా వాగ్ధాటిని మేలి జలతారు వస్త్రం గా ధరించి, అష్టదిగ్గజాల ఆలనలో - వారి సమకాలీన కవుల పాలనలో నిత్య నూతనముగా భాషించే సొబగులను పులుముకొని నాటికి.. నేటికి.. ఏనాటికైనా అంధ్రత్వానికి నిలువుటద్దంలా పరిమలించే నా తెనుగుతల్లికి మా పూర్వకవులు అలంకరించిన వసివాడని మల్లెపూదండను ఆప్యాయంగా స్పృసించే... నా కన్నతల్లికి మంగళారతులు పట్టిన మహనీయులను స్మరించే చిన్ని నా ప్రయత్నమే మన"సు"భాషణం !!

No comments:

Post a Comment